VIDEO: చిన్నేరు ప్రాజెక్టు సమీపంలో కొండచిలువ కలకలం
అన్నమయ్య: తంబళ్లపల్లి మండలం చెన్నప్పగారిపల్లె సమీపంలోని చిన్నేరు ప్రాజెక్టు పక్కన ఎర్రకొండ వద్ద సోమవారం సుమారు 7-8 అడుగుల పొడవు ఉన్న కొండచిలువ ఒక గొర్రెను మింగేందుకు ప్రయత్నించింది. మేత కోసం వెళ్లిన గొర్రెల మందలోకి చొరబడిన కొండచిలువను కాపరులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా, అది వారిపైకి తిరగబడింది. అనంతరం ఓ గొర్రెను సమీప వంక వైపు లాక్కుని అడవిలోకి వెళ్ళిపోయింది.