'విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు'
SRD: పోలీసు అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. సంగారెడ్డిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో క్రైమ్ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాంగ్ పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించేలా ఎస్సైలు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అదన పీఎస్పీ రఘునందన్ రావు పాల్గొన్నారు.