వీధి లైట్లు ఏర్పాటు చేయాలంటూ వినతి

వీధి లైట్లు ఏర్పాటు చేయాలంటూ వినతి

ASR: డుంబ్రిగుడ మండలంలోని పోతంగి పంచాయతీ పరిధిలోని ఉన్న గ్రామాలకు సీసీ రోడ్డులు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని వైసీపీ మండల కార్యదర్శి ఎం. శంకర్ కోరారు. ఈ సందర్భంగా పంచాయితీ కార్యదర్శి గౌతమినీ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. సీసీ రోడ్లు, వీధిదీపాలు లేక గిరిజనులు అనేక అవస్థలు పడుతున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు.