'ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు'

GNTR: రాబోయే 4 రోజులు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద ఉండవద్దని హెచ్చరించారు. నిన్న గుంటూరులో 81 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు.