బీసీ రిజర్వేషన్లకై రాజ్యాంగ సవరణ చేయాలని దీక్ష

MNCL: బీసీ రిజర్వేషన్లకై రాజ్యాంగ సవరణ చేయాలని బుధవారం జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంచిర్యాలలోని గాంధీ చౌక్‌లో నిరసన దీక్ష చేశారు. ఈ సందర్భంగా సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన బీసీలకు రావాల్సిన ప్రజాస్వామ్య వాటాకు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు.