చిత్తూరు-కుప్పం రైల్వే లైన్‌పై మరో ముందడుగు

చిత్తూరు-కుప్పం రైల్వే లైన్‌పై మరో ముందడుగు

చిత్తూరు-కుప్పం నూతన రైల్వే లైన్ ఫైనల్ లొకేషన్స్ సర్వే (FLS) మంజూరయింది. ఈ ఏడాది జనవరిలోనే అధికారులు సర్వే పూర్తి చేసి రైల్వే శాఖకు ప్రతిపాదనలు పంపారు. ప్రాజెక్టుకు ఎంత వ్యయం అవుతుంది? భూ సేకరణ ఎంత చేయాలి? ఈ రైల్వే లైను ఆమోదయోగ్యమేనా..? తదితరాంశాలను మరోసారి పరిశీలించనున్నారు. కాగా, ఈ కొత్త రైల్వే మార్గం 135.8 కిలోమీటర్లు ఉండనుంది.