నిజాంసాగర్ కాల్వలకు నీటి విడుదల

నిజాంసాగర్ కాల్వలకు నీటి విడుదల

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఆయకట్టు సాగు అవసరాల కోసం సోమవారం నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్టు ప్రధాన కాల్వ ద్వారా సుమారు 2,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు. జలాశయంలో తగినంత నీటి నిల్వలు ఉన్నాయని, రైతుల విన్నపం మేరకు సాగునీటిని సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు.