VIDEO: అంగన్వాడీలకు అండగా ప్రభుత్వం
SKLM: ఎన్డీఏ ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు సోమవారం అన్నారు. చరిత్రలో తొలిసారిగా వేతనాలను రెండుసార్లు పెంచిన ఘనత నారా చంద్రబాబు ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఉద్యోగుల తొమ్మిది డిమాండ్లను ఇప్పటికే పరిష్కరించామని, మిగిలిన అంశాలపై కూడా ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందన్నారు.