VIDEO: మంటల్లో కారు దగ్ధం.. తప్పిన ప్రమాదం

VIDEO: మంటల్లో కారు దగ్ధం.. తప్పిన ప్రమాదం

కృష్ణా: మంటల్లో కారు దగ్ధం అయిన ఘటన కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి వద్ద చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో క్షణాల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. కారులో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. వెంటనే అప్రమత్తమై కారు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు.