శివరాత్రి ఉత్సవాలకు నగరంలో ట్రాఫిక్ మళ్లింపు

వరంగల్: మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని నగరంలో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్‌కిషోర్ ఝా తెలిపారు. ఉత్సవాల సందర్భంగా భక్తులు హనుమకొండ వేయి స్తంభాల ఆలయానికి అధిక సంఖ్యలో వస్తారని, అందుకోసం హనుమకొండ ప్రధాన రహదారిపై 7వ తేదీ అర్ధరాత్రి నుంచి 9వ తేదీ ఉదయం 10గంటల వరకు ట్రాఫిక్ మళ్లించనున్నట్లు చెప్పారు.