తనిఖీల్లో పట్టుబడ్డ చరవాణుల దొంగ

VZM: విశాఖపట్నం రైల్వే డీఎస్పీ రామచంద్రరావు ఆదేశాలతో విజయనగరం జీఆర్పీ ఎస్సై బాలజీరావు నేతృత్వంలో ప్లాట్‌ఫారాలను గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రహ్లదాపురంకు చెందిన డి.లక్ష్మణ్ పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడించి అతనిని విచారణ చేయగా రూ.లక్షల విలువ గల 4 చరవాణులు స్వాధీనం చేసుకొని, రిమాండ్ నిమిత్తం విశాఖ కోర్టుకు తరలించామన్నారు.