AIYF రాష్ట్ర మహాసభల కరపత్రాల విడుదల చేసిన మంత్రి

SKLM: అఖిల భారత యువజన సమైక్య (ఐఎఫ్)రాష్ట్ర 22వ మహాసభల కరపత్రాలు మంత్రి అచ్చెన్నాయుడు గురువారం నిమ్మడ క్యాంప్ ఆఫీస్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర పురోభివృద్ధికి యువత పాత్ర అత్యంత కీలకమైనదని, రాష్ట్ర సంపద సృష్టించడంలో వారి కృషి అవసరమన్నారు. శ్రీకాకుళంలో పిభ్రవరి నెల 6 నుంచి 9 వరకు జరగబోయే AIYF మహాసభలు జయప్రదం చేయాలని కోరారు.