పొట్టి శ్రీరాములు ఆశయాలు స్ఫూర్తిదాయకం: కలెక్టర్
సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్‌లో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన నిస్వార్థ సేవలు, అంకితభావం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.