అశోక్ నగర్‌లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
BDK: భద్రాచలం అశోక్ నగర్ కాలనీ (11వ వార్డు)లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపన జరిగింది. వార్డు సభ్యురాలు భూక్యా సుశీల నిధులతో చేపట్టనున్న ఈ పనులను స్థానిక సర్పంచ్ పూనెం కృష్ణదొర ప్రారంభించారు. కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలని, కాంట్రాక్టరుకు సూచించారు.