'హామీల అమలులో కాంగ్రెస్ విఫలం'

NRPT: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 420 హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ధన్వాడ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో విఫలం చెందిన ప్రభుత్వాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తారని భయంతో ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు.