పోలీస్ స్టేషన్‌లో స్వల్ప అగ్ని ప్రమాదం

VSP: కంచరపాలెం పోలీస్ స్టేషన్ సర్వర్ రూమ్‌లో గురువారం స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ మేరకు సర్వర్ రూమ్‌లో ఉన్న కంప్యూటర్ సీపీయూ నుండి పొగలు వ్యాపించడంతో అప్రమత్తమైనా కంచరపాలెం పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. తక్షణం ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సీపీయూ నుండి వస్తున్న పొగలను అదుపు చేశారు.