రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్

VSP: విశాఖలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు ఆదివారం రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ బాబు మాట్లాడుతూ.. రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే లేదా శాంతి భద్రతలకు భంగం కలిగించినట్లెతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.