డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు
సంస్కృతం భాషపై తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సంస్కృత భాష ఒక మరణించిన భాష అని విమర్శించారు. తమిళ భాష పట్ల కేంద్రం చిన్నచూపు చూస్తోందని ధ్వజమెత్తారు. తమిళ భాష అభివృద్ధి కోసం కేంద్రం కేవలం రూ.150 కోట్లు కేటాయించిందని, అదే సమయంలో సంస్కృత భాష కోసం రూ.2400 కోట్లు కేటాయించిందని మండిపడ్డారు.