అమర్నాథ్ యాత్రికులకు వైద్య పరీక్షలు
HYD: అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తుల కోసం గాంధీ ఆస్పత్రిలో ఈ నెల 18 నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రారంభం కానుంది. కేంద్ర నిబంధనల మేరకు మెడికల్ బోర్డు పరీక్షలు నిర్వహించి ఉచితంగా సర్టిఫికెట్లు అందజేస్తుంది. ప్రతి శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతుంది. భక్తులు ఆన్‌లైన్ దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకుని, వైద్య పరీక్షలు పూర్తి చేసి హాజరుకావాలి.