VIDEO: జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో భక్తుల రద్దీ

VIDEO: జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో భక్తుల రద్దీ

SKLM: పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగను శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్నానాలు చేసి, కొత్త బట్టలు ధరించి ఆలయాలకు చేరుకున్నారు. ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం కార్యక్రమాలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా భక్తులు కొత్త ఏడాది శుభమై ఉండాలని కోరుకున్నారు.