పురుగుల మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య

పురుగుల మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య

BPT: కొల్లూరు మండలం పోతార్లంకలో కౌలు రైతు ఈడుపుగంటి మురళీకృష్ణ (40) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వారం క్రితం వరదలతో పంట నష్టపోవడంతో మనస్తాపానికి లోనై పురుగుల మందు తాగినట్లు స్థానికులు వివరించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు తెలిపారు. కౌలుకు 8 ఎకరాలు తీసుకుని సాగు చేస్తూ, ఖర్చుల కోసం బ్యాంకులో రుణాలు తీసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.