మహమ్మదాబాద్‌లో 40 కుక్కలకు రెబీస్ టీకాలు
MBNR: ప్రపంచ రెబీస్ దినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక ప్రాథమిక పశువైద్య శాలలో ఉచిత టీకా శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 40 కుక్కలకు రెబీస్ టీకాలు వేశారు. పెంపుడు కుక్కల యజమానులకు రెబీస్ వ్యాధి నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. డాక్టర్ కే. నరేందర్ యాదవ్ పర్యవేక్షణలో వీఏలు సుధాకర్, అన్నపూర్ణ, సంజీవ్, సిబ్బంది పాల్గొన్నారు.