'అర్ధాంతరంగా నిలిచిపోయిన వంతెన నిర్మాణానికి మోక్షం'

'అర్ధాంతరంగా నిలిచిపోయిన వంతెన నిర్మాణానికి మోక్షం'

ATP: రాయదుర్గం పట్టణ అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా నిలిచే అనంతపురం రోడ్డులో అర్ధాంతరంగా నిలిచిపోయిన వంతెన నిర్మాణానికి మోక్షం లభించింది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 46.24 కోట్లు మంజూరు చేస్తూ జీవో జారీ చేసిందని ఎమ్మెల్యే కాలువ మీడియాతో తెలిపారు. ఈ విజయం వెనక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రోడ్డు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి సహకారం ఉందన్నారు.