సోమశిలలో 8.0 మి.మీ వర్షపాతం నమోదు

NLR: సోమశిలలో 8.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా మండల వ్యాప్తంగా వర్షం కురుస్తుండడంతో పలు రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా తీవ్ర ఎండతో అల్లాడుతున్న ప్రజలు ఉపశమనం పొందారు. వర్షం రాకతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.