జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే
అనకాపల్లి పట్టణం గవరపాలెం నూకాంబిక అమ్మవారి జాతర జాతర ఏర్పాట్లను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ఈనెల 15 నుంచి నెల రోజుల పాటు జరిగే జాతరలో సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలక్కుండా ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.