మొక్కజొన్న రైతుల ఆవేదన
VZM: మొక్కజొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శనివారం వంగర మండలంలోని ఓని అగ్రహారం, సంగాం, గ్రామాలలో మొక్కజొన్న గింజలను ఆరబెట్టారు. ఐకేపీ కేంద్రాలతో కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు. మండల వ్యవసాయ అధికారి కన్నబాబును సంప్రదించగా.. మండలంలో 355 ఎకరాలలో మొక్కజొన్న పంట సాగు జరిగిందన్నారు.