శిధిలావస్థలో జిల్లా గ్రంధాలయం

ELR: ఏలూరు నగరంలోని స్థానిక జిల్లా గ్రంథాలయం శిథిలావస్థకు చేరుకుంది. గ్రంథాలయం భవనం పై కప్పు పెచ్చులు ఊడిపోయి ఎప్పుడు మీద పడతాయో అన్న పరిస్థితికి చేరింది. దీంతో గ్రంథాలయం బయట అధికారులు పాఠకులకు ముందస్తుగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసి జాగ్రత్త వహించాలని అన్నారు. అలాగే హెల్మెట్ ధరించి లోపలికి రావాలని సూచిస్తున్నారు.