ఎన్నికల ప్రచార వాహనానికి అనుమతి తప్పనిసరి

కృష్ణా: నూజివీడు రాజీవ్ సర్కిల్ వద్ద టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొలుసు పార్థసారథి ఎన్నికల ప్రచార ఆటోను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం బుధవారం ఉదయం తనిఖీ చేశారు. స్క్వాడ్ బృందం సభ్యులు ఎంఈఓ సర్వేశ్వరరావు, కానిస్టేబుల్ ఎస్ రాధాకృష్ణ, రామకృష్ణలు ఆటోను తనిఖీ చేసి అనుమతి పత్రాలు ఉండడంతో వదిలేశారు. ప్రచార వాహనాలకు అనుమతి తప్పనిసరి అన్నారు.