'ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలి'
KDP: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మనోహర్ డిమాండ్ చేశారు. పులివెందులలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో మెడికల్ కళాశాలలు నిర్వహించడం వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారుతుందన్నారు. ఇప్పటికైనా పాలకులు ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.