రాష్ట్ర శెట్టిబలిజ విభాగం అధ్యక్షుడిగా కవురు

W.G: వైసీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీలను నిన్న అధిష్టానం నియమించింది. ఈ క్రమంలో వైసీపీ రాష్ట్ర శెట్టిబలిజ విభాగం అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ నియమితులయ్యారు. గతంలో వీరవాసరం ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్‌గా పనిచేసిన శ్రీనివాస్.. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆయన నియామకంపై పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.