రైతులకు టోకెన్లు జారీ
MNCL: రైతులు పండించిన వరి ధాన్యాన్ని అమ్మాలంటే టోకెన్లు చూపించడం తప్పనిసరి అని జన్నారం మండలంలోని పోన్కల్ క్లస్టర్ ఏఈవో త్రిసంధ్య అన్నారు. గురువారం జన్నారం మండలంలోని బాదంపల్లిలో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం రైతులకు ధాన్యం టోకెన్లు పంపిణీ చేశారు. ప్రభుత్వం సూచించిన ప్రకారం ధాన్యంలో 17% తేమ ఉండేలా రైతులు జాగ్రత్త పడాలన్నారు.