సింహాచలంలో విశ్రాంతి భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే

సింహాచలంలో విశ్రాంతి భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే

VSP: సింహాచలం దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన విశ్రాంతి భవనాన్ని బుధవారం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ప్రారంభించారు. భక్తులకు మరిన్ని సేవలు, సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. దేవస్థానం అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణబాబు, మేయర్ పీలా శ్రీనివాస్ పాల్గొన్నారు.