పెరగనున్న మెట్రో చార్జీలు

పెరగనున్న మెట్రో చార్జీలు

HYD: హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పెరగనున్నాయి. కొంతకాలంగా ఛార్జీలను పెంచేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ కసరత్తు చేపట్టింది. ప్రస్తుతం కనిష్టంగా రూ.10, గరిష్టంగా రూ.60 వరకు మెట్రో ఛార్జీలు ఉన్నాయి. 20 శాతం పెంచితే రూ.15 నుంచి రూ.75 వరకు పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఛార్జీల పెంపు వల్ల ఇప్పుడున్న నష్టాలను అధిగమించేందుకు కొంతవరకు ఊరట లభించనుంది.