"విద్యార్థులకు నాణ్యమైన భోజన అందించాలి"
MHBD: జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి గూడూరు(M)కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల (బాలికలు) వసతి గృహాన్ని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి గుగులోత్ దేశీ రామ్ నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన తరగతి గదులు, వంటగదిని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలన్నారు.