భక్త వీరాంజనేయుడికి ప్రత్యేక పూజలు

భక్త వీరాంజనేయుడికి ప్రత్యేక పూజలు

KDP: సిద్దవటం మండలంలోని కొత్త మాధవరం 123 వార్డులో వెలసిన శ్రీ భక్త వీరాంజనేయ స్వామికి ఇవాళ ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం, అలంకరణ, గణపతి పూజ, ఆకు పూజ,వడమాల పూజ, సహస్రనామార్చన చేశారు. భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.