మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే

మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే

సత్యసాయి: మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సోమవారం చెప్పులు కుట్టే వ్యక్తికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు. రెండు నెలల క్రితం హామీ ఇచ్చిన ప్రకారం సొంత నిధులు రూ. 2 లక్షలతో నిర్మించిన నూతన షాపును రామాంజి అనే వ్యక్తితో ప్రారంభం చేయించారు. నిరుపేదల ఆర్థిక సాధికారత కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.