VIDEO: తెలంగాణ అమరుడు కృష్ణయ్యను స్మరించిన కాంగ్రెస్
MBNR: తెలంగాణ ఉద్యమ అమరుడు పోలీస్ కృష్ణయ్య త్యాగాలు చిరస్మరణీయమని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. మహబూబ్ నగర్ తెలంగాణ చౌరస్తాలో కృష్ణయ్య వర్ధంతి సందర్భంగా గోడపత్రికలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. కృష్ణయ్య పోరాటం వల్లే తెలంగాణ సాధనకు బలాన్నిచ్చిందని పేర్కొన్నారు.