బాధితులను పరామర్శించిన మంత్రి
JGL: మల్యాల మండలం కొండగట్టులో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని పోలీసులకు ఆదేశించినట్లు రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని దుకాణదారులకు విద్యుత్, రెవెన్యూ శాఖల ద్వారా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.