పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి

మన్యం: పాచిపెంట మండలంలో పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా పిఓ, సాలూరు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి విష్ణు చరణ్ సోమవారం తనిఖీ నిర్వహించారు. మండలం కర్రివలసలో ఎంపీపీ స్కూల్, గైరంపేట ఎంపీయూపీ పాఠశాలలో పోలింగ్ స్టేషన్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. పిఓ వెంట పాచిపెంట తాహసిల్దార్ పి.బాల, డిప్యుటీ తాహసిల్దార్ రాజశేఖర్, ఎంపీడీఓ పి.లక్ష్మీకాంత్ పాల్గొన్నారు.