తాగునీటి సమస్యలపై అధికారులతో ఎమ్మెల్యే చర్చ

KRNL: ఆదోని నియోజకవర్గంలోని 16గ్రామాలకు తాగునీరు సరఫరా చేసే వాటర్ స్కీంల నిర్వహణపై ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి బుధవారం గ్రామీణ నీటి పారుదల శాఖ డీఈ, ఏఈలతో సమావేశం నిర్వహించారు. 1995లో ఏర్పాటు చేసిన ఈ పైపులైన్‌తో నిత్యం సమస్యలు వస్తున్నాయని అన్నారు. ఇప్పుడు ఉన్న జనాభాకు అనుగుణంగా నీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.