వృత్తి విద్యపై అవగాహన పెంపు కార్యక్రమం

వృత్తి విద్యపై అవగాహన పెంపు కార్యక్రమం

అన్నమయ్య: ఓబులవారిపల్లి కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలోని బాలికలు, గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం టైలరింగ్ శిక్షణ పొందారు. ట్రస్ట్ ఛైర్మన్ పార్థసారథి విద్యార్థులకు యూనిఫాం, బ్లేజర్ డ్రెస్ కటింగుపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యతో పాటు వృత్తి విద్యలోనూ అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. వృత్తి విద్య ఆవశ్యకతను విద్యాసహాయకురాలు భాగ్యలక్ష్మి నొక్కి చెప్పారు.