పిడుగుపాటుకు ఇద్దరు మృతి.. నలుగురికి గాయాలు
ప్రకాశం: పుల్లలచెరువు మండలంలో సోమవారం పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. మొక్కజొన్న ఫ్యాక్టరీలో పిడుగు పడటంతో బీహార్‌కు చెందిన కన్నయ్య అనే వ్యక్తి మృతి చెందగా మరో నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పుల్లలచెరువు మండలం ఎండ్రపల్లి గ్రామంలో నాగయ్య అనే వ్యక్తి కూడా పిడుగుపాటుకు మృతి చెందాడు.