VIDEO: డ్రైనేజీ పొంగిపొర్లి రోడ్డుపైకి మురికినీరు
KDP: పులివెందుల పట్టణంలో బుధవారం డ్రైనేజీ పొంగిపొర్లడంతో అరబిందో స్కూల్ సమీపంలో రోడ్లపైకి మురుగునీరు చేరింది. దీంతో స్థానికులు, ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే విద్యార్థులు దుర్వాసన, చెత్త నీటి మధ్య నడవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి, శుభ్రతా చర్యలు చేపట్టాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.