పని చేస్తేనే శ్రమ విలువ తెలుస్తుంది: ప్రిన్సిపల్
GDWL: గద్వాల ప్రియదర్శిని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో వెంకంపేటలో వారం రోజులుగా జరిగిన ఎన్ఎస్ఎస్ శిబిరం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మీనాక్షి మాట్లాడుతూ.. శ్రమించినప్పుడే దాని విలువ తెలుస్తుందని, సేవా కార్యక్రమాలతో విద్యార్థుల్లో సామాజిక బాధ్యత పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీవో జగన్మోహన్, గ్రామస్థులు పాల్గొన్నారు.