పుట్టపర్తిలో విమానాశ్రయ భద్రతపై సమీక్షా సమావేశం
సత్యసాయి: పుట్టపర్తిలోని సత్యసాయి విమానాశ్రయంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. శుక్రవారం పుట్టపర్తి విమానాశ్రయంలో నిర్వహించిన విమానాశ్రయ భద్రతా కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చర్యలు తీసుకునేలా సిద్ధంగా ఉండాలని సూచించారు.