స్వామివారి సేవలో ఒడిశా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి
CTR: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానాన్ని ఒడిశా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణ పట్నాయక్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేష వస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు.