VIDEO: పోలింగ్ స్టేషన్లను పరిశీలించిన సెక్టర్ ఆఫీసర్
NZB: సిరికొండలోని పోలింగ్ స్టేషన్లను సెక్టార్ ఆఫీసర్ నర్సయ్య శుక్రవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ర్యాంప్ సౌకర్యం, విద్యుత్ సరఫరా, తాగునీరు వంటి కనీస వసతులు, భవనం అనుకూలంగా ఉందా లేదా అని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ వినీల్, స్కూల్ ప్రధానోపాధ్యాయుడు సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.