'క్రీడలతో ఒత్తిడి దూరం'

NLR: క్రీడలతో ఒత్తిడి నుంచి ఉపశమనం కలగడమే కాకుండా మానసికోల్లాసం కలుగుతుందని నెల్లూరు సౌత్ ట్రాఫిక్ ఎస్ఐ నాగరాజు అన్నారు. శుక్రవారం ఎన్టీఆర్ నగర్‌లోని ఎస్.వి.జి.ఎస్ కళాశాల గ్రౌండ్లో సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటో కార్మికుల క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. స్నేహపూర్వక వాతావరణంలో ఈ పోటీలు నిర్వహించుకోవాలని ఆయన కార్మికులకు సూచించారు.