VIDEO: టౌన్ ప్లానింగ్ అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం

VIDEO: టౌన్ ప్లానింగ్ అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం

గుంటూరు టౌన్ ప్లానింగ్ అధికారులపై ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డిపాలెం గ్రామంలో ప్రభుత్వ భూమిలో నివసిస్తున్న ఎస్సీ, ఎస్టీలను ఖాళీ చేయిస్తే తమ స్థలాలకు డిమాండ్ పెరుగుతుందని లేఔట్ యజమానులు కోర్టుకు తప్పుడు పత్రాలు సమర్పించారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ సమాచారం అందకున్న ఎమ్మెల్యే బూర్ల, లేఔట్ పత్రాలను పరిశీలించి అధికారుల తీరుపై మండిపడ్డారు.