సుద్దపల్లిడొంకలో చోరీ.. బంగారం, నగదు మాయం

సుద్దపల్లిడొంకలో చోరీ.. బంగారం, నగదు మాయం

GNTR: పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సుద్దపల్లిడొంక లక్ష్మీనగర్‌లో చోరీ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంకమ్మరావు, కాసమ్మ దంపతులు కుటుంబ సభ్యులతో గురువారం కలిసి బయటకువెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించారు. బంగారు ఆభరణాలతో పాటూ రూ.2 లక్షల నగదు అపహరణకు గురైనట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.